వైభవంగా కార్తీక పౌర్ణమి పూజలు

CTR: నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు శుక్రవారం కార్తీక మాసం పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. ఉదయం అమ్మవారి అభిషేకం, హోమం పూర్ణాహుతి కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రూపేష్ క్రిష్ణ ఆచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం అందజేశారు.