వ్యర్థాలకు బదులుగా నిత్యవసర సరుకులు పంపిణీ
కృష్ణా: పెంజెంద్ర గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం భాగంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథం ప్రజల్లో శుభ్రతపై అవగాహన కల్పిస్తోంది. ఈ క్రమంలో గృహాలలో ఉపయోగం లేకుండా పడి ఉన్న ప్లాస్టిక్ వస్తువులు, ఇనుప సామగ్రి, పేపర్లు వంటి వ్యర్థాలను ప్రజల నుంచి స్వచ్ఛ రథం వాహనదారుడు సేకరించాడు. సేకరించిన వ్యర్థాలకు బదులుగా గ్రామ ప్రజలకు నిత్యావసర వస్తువులను ప్రజలకు అందజేశారు.