సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే బండారు
కోనసీమ: వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం సాయంత్రం సమయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ ప్రజా సమస్యలపై సమగ్ర నివేదికను సమర్పించారు. నియోజకవర్గ ప్రజల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని పలు కీలక అంశాలను ముఖ్యమంత్రికి వివరిస్తూ వినతిపత్రం అందజేశారు.