14 అడుగులకు చేరిన మున్నేరు నీటిమట్టం

14 అడుగులకు చేరిన మున్నేరు నీటిమట్టం

KMM: ఖమ్మం మున్నేరుకు వరద మళ్లీ పెరుగుతోంది. కాల్వఒడ్డు వద్ద ఉన్న మున్నేరు వాగు నీటిమట్టం మధ్యాహ్నం 13 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 14 అడుగులకు చేరింది. క్రమంగా ఒక అడుగుల మేర పెరిగింది. వరద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో నగర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాగా, 16 అడుగులకు చేరితే మొదటి ప్రమాద సూచిక జారీ చేయనున్నారు.