బైక్ ప్రమాదం: రాజోలి వాసికి తీవ్ర గాయాలు
గద్వాల జిల్లా రాజోలి గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పని నిమిత్తం రాజోలి నుండి కర్నూలుకు బైక్‌పై వెళ్తుండగా, కర్నూలు జిల్లా సింగవరం గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శేఖర్‌కు తీవ్ర గాయాలవగా, పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.