'విద్యార్థులు ఆందోళనకు గురికావద్దు
SKLM: 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్దులు ఆందోళనకు గురికావద్దని పలాస డివిజన్ ఉప విద్యాశాఖాధికారి పి.విలియమ్స్ అన్నారు. బుధవారం వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో నిర్వహించిన వీడ్కోలు సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకూడదన్నారు.