ఇసుక మాఫియాపై ఉక్కుపాదం
ASF: సిర్పూర్ నియోజకవర్గంలో ఇసుక మాఫియా అక్రమ తవ్వకాలు, రవాణాపై అధికారులు దృష్టిసారించారు. కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో ధరంపల్లి వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి, శుక్రవారం రాత్రి మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల బృందాలు సంయుక్త దాడులు చేపట్టాయి. డంపింగ్ చేసిన ఇసుకను స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.