కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ గురువారం సందర్శించారు. కొలనూరు, కనగర్తి ఐకేపీ, సింగిల్ విండోల వద్ద కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, హమాలీలకు, నిర్వాహకులకు సూచనలు చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.