'వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే నరకం'

ADB: ఇచ్చోడ మండలం బోరిగామలోని పంట చేనులకు వెళ్లే మొరం రోడ్డు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బురదమయంగా మారింది. పనులు చేసేందుకు చేనులోకి కాలినడకన, ఎడ్లబండ్లపై వెళ్లాలంటే ఎక్కడ కూరుకు పోతుందోనని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మొరం రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.