హైడ్రా మార్షల్స్ ఆందోళన( VIDEO)

హైడ్రా మార్షల్స్ ఆందోళన( VIDEO)

HYD: హైడ్రా మార్షల్స్ విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. జీతంలో కోత విధించారని నిరసనకు దిగిన మాజీ ఆర్మీ సైనికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో రూ.29 వేలు ఉన్న తమ జీతంలో రూ.7వేలు తగ్గించారని వారు ఆరోపిస్తున్నారు. కూల్చివేతలు చేపట్టే ప్రాంతాల్లో భద్రత కల్పించే ఈ మార్షల్స్ విధులను బహిష్కరించడంతో GHMC చేపట్టిన మాన్సూన్ ఆపరేషన్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.