VIDEO: ఆటోలోంచి పడడంతో వృద్ధురాలికి తీవ్ర గాయాలు

VIDEO: ఆటోలోంచి పడడంతో వృద్ధురాలికి తీవ్ర గాయాలు

KMM: కామేపల్లి మండలం తాళ్లగూడెం సమీపంలో శుక్రవారం ముచ్చర్ల గ్రామానికి చెందిన షేక్ రసూల్ బి (84) అనే వృద్ధురాలు ఆటోలోంచి రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. పెన్షన్ కోసం బ్యాంకుకు ఆటోలో వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం యూటర్న్ తీసుకోవడంతో ఆటో డ్రైవర్ బ్రేక్ వేయగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు ఆమెను 108 ద్వారా ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.