కేసముద్రంలో దొంగలు బీభత్సం.. నగదు చోరీ
MHBD: కేసముద్రం మండలంలో మంగళవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఉప్పరపల్లి రోడ్డులోని ఓ కిరాణా దుకాణంలో సుమారు రూ. 85 వేల సొత్తును దోచుకెళ్లారు. దుకాణంలో చిల్లర కోసం తెచ్చిన రూ. 40 వేల రూపాయలు, సుమారు రూ.40 వేల రూపాయల విలువగల సిగరెట్లు, పాన్ షాపులో ఉన్న రూ. 5 వేలు మొత్తం కలిపి రూ. 85 వేలు దొంగలు ఎత్తుకెళ్లినట్టు బాధితుడు తెలిపారు.