జీలుగుమిల్లిలో ఈ-రిక్షాను ప్రారంభించిన ఎమ్మెల్యే
ELR: జీలుగుమిల్లి మండల కేంద్రంలో సోమవారం స్వచ్ఛరథం, ఈ-రిక్షాను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. గ్రామ పరిశుభ్రతను మరింత బలోపేతం చేయడానికి, చెత్త సేకరణను సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రజలు కూడా పరిశుభ్రతపై అవగాహన పెంచుకొవలన్నారు.