సెర్చ్ ద్వారా వరి కొనుగోలు కేంద్రాలు

సెర్చ్ ద్వారా వరి కొనుగోలు కేంద్రాలు

WNP: ఆత్మకూరు మండలంలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆరుచోట్ల వరి కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ఏపీఎం పారిజాత తెలిపారు. పిన్నించర్ల, మూలమల్ల, జూరాల, గుంటిపల్లి, కత్తేపల్లి, మేడపల్లి గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 3,593 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, సన్నరకం ధాన్యం 14% తేమశాతం ఉండాలని ఆమె సూచించారు.