పోలీస్ స్టేషను సందర్శించిన సీపీ అనురాధ

సిద్దిపేట: లోకసభ ఎన్నికల నేపథ్యంలో దుబ్బాక, భూంపల్లి, మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లను పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ బుధవారం సందర్శించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వహించాల్సిన విధి విధానాల గురించి అవగాహన కల్పించారు. వారితో సిద్దిపేట ఏసీపీ మధు, దుబ్బాక సీఐ శ్రీనివాస్, ఎస్ఐ గంగరాజు, భూంపల్లి ఎస్ఐ రవికాంత్ రావు, మిరుదొడ్డి ఎస్ఐ పరశురామ్ ఉన్నారు.