'విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలి'

NRPT: సెప్టెంబర్ నెల కాంప్లెక్స్ సమావేశం పెద్ద జట్రం పాఠశాలలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎచ్‌ఎం గౌరమ్మ మాట్లాడుతూ.. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని. బోధన పద్ధతులను సరికొత్త మార్గాల్లో అమలు చేసి విద్యార్థుల్లో నేర్చుకునే తపనను పెంపొందించాలని అన్నారు. ఈ సమావేశంలో మండలంలోని పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.