చెరువులో యువకుడి మృతదేహం లభ్యం

చెరువులో యువకుడి మృతదేహం లభ్యం

KDP: వల్లూరు మండలంలోని పుష్పగిరి వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈత కోసం వెళ్లి చెరువులో గల్లంతైన చైతన్య అనే యువకుడి మృతదేహం సోమవారం లభ్యమైంది. రెస్క్యూ టీం సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే, అతనితో పాటు గల్లంతైన మరో యువకుడి ఆచూకీ ఇంకా లభించలేదు. ఆ రెండవ యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.