ఫ్రీ వైఫై వాడుతున్నారా?

ఫ్రీ వైఫై వాడుతున్నారా?

మొబైల్ డేటా ఉన్నప్పటికీ కొందరు పబ్లిక్ ప్లేస్‌లో ఫ్రీ వైఫై వాడుతుంటారు. అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదు. పబ్లిక్ వైఫైలో తగినంత భద్రత ఉండదు. దీంతో వాటికి కనెక్ట్ అయిన ఫోన్లకు హ్యాక్ ప్రమాదం ఎక్కువ. అలాగే బ్యాంక్ డీటెయిల్స్, వ్యక్తిగత డేటా చోరీకి కూడా అవకాశం లేకపోలేదు. అందుకే సాధ్యమైనంతవరకు ఫ్రీ వైఫై వాడొద్దని నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సూచిస్తోంది.