అధికారులపై కౌన్సిలర్ ఆగ్రహం..!
JGL: జగిత్యాల 25వ వార్డు సభ అధికారుల నిర్లక్ష్యంతో వివాదాస్పదమైంది. కౌన్సిలర్ సామల్ల జమున సభను బహిష్కరించి నిరసన తెలిపారు. తాము సూచించిన చోట కాకుండా మరోచోట సభ పెట్టడంపై ఆమె మండిపడ్డారు. జీవన్ రెడ్డి అనుచరులమనే వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ సభ ప్రాంగణానికి తాళం వేశారు. దీంతో మున్సిపల్ కమిషనర్ వెనుదిరిగారు.