VIDEO: త్రిపురాంతకంలో కార్తీక దీపోత్సవం
ప్రకాశం: త్రిపురాంతకంలోని శ్రీ పార్వతి సమేత త్రిపురాంతకేశ్వరుడి ఆలయంలో కార్తీక మాసం మాస శివరాత్రిని పురస్కరించుకొని కార్తీక దీపోత్సవం, సహస్ర జ్యోతి లింగార్చన, సోపాన దీపోత్సవం కార్యక్రమాలను అర్చకులు, అధికారులు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.