మోడల్ ప్రైమరీ స్కూల్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు
E.G: సీతానగరం మండలం చిన్నకొండేపూడి గ్రామంలోని మోడల్ ప్రైమరీ స్కూల్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నకొండేపూడి సొసైటీ ఛైర్మన్ కాండ్రు శేఖర్ పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ విలువలను విద్యార్థులు పాటించాలని, విద్యతోనే దేశ అభివృద్ధి సాధ్యమని తెలిపారు.