పంచాంగం శ్రవణ పుస్తక ఆవిష్కరణ
W.G: ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం చేయడం అంటే కాలపురుషుడైన శ్రీమహావిష్ణువును పూజించడమేనని ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. గునుపూడిలోని దాసాంజనేయ స్వామి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ పుస్తకాలను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పంచాంగ శ్రవణానికి, రైతులకు విడదీయలేని బంధం ఉందన్నారు.