జిల్లాలో పెద్దపులి కదలికలు.. జాగ్రత్త..!
ELR: పోలవరంలోని దేవీపట్నం ప్రాంతంలో పెద్దపులి కదలికలు కలకలం రేపుతున్నాయి. ఈ మేరకు అధికారులు పోచమ్మ గండి ప్రాంతానికి అలర్ట్ జారీ చేశారు. భక్తులు, టూరిస్టులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కొండ ప్రాంతానికి వెళ్లవద్దని ఆదేశించారు. దీంతో పరిసర గ్రామాల్లోని అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమైనట్లు వెల్లడించారు.