నీళ్లు ఎడారి రూపం దాల్చిన కృష్ణమ్మ నది..!
గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లిలోని పుణ్యక్షేత్రంలో సరిహద్దులో ప్రవహిస్తున్న కృష్ణానది పూర్తిగా పొడిబారింది. ఫిబ్రవరిలో కళకళలాడిన నది, మార్చి నెల పూర్తి కాకముందే రాళ్లు తేలి వెలవెలబోతోంది. ఎటు చూసినా కృష్ణా నీళ్లు కనిపించక రాళ్లు, రప్పలు, ముళ్ళపొదలు దర్శనమిస్తున్నాయి. చేపలు నీళ్లు లేక చనిపోతున్నాయి. జూరాల నుంచి చిన్నపాయల మాత్రమే నీళ్లు ప్రవహిస్తోంది.