లక్ష్మీ గణపతికి లక్ష దీపారాధన

లక్ష్మీ గణపతికి లక్ష దీపారాధన

SKLM: జిల్లాలోని మొండేటివీధిలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దేవాలయంలో వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో భక్తులు భక్తి శ్రద్ధలతో లక్ష దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి దీపాలు వెలిగించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.