14వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు
NGKL: చారకొండ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట చేస్తున్న రిలే నిరాహార దీక్షలు సోమవారంతో 14వ రోజుకు చేరాయి. గోకారం- ఎర్రవల్లిలో నిర్మిస్తున్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి తమ గ్రామాలను ముంపు నుంచి కాపాడాలని, ఆర్అండ్ఆర్ జీవోలు రద్దు చేయాలని నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.