గోడకూలి వలస కూలి మృతి

గోడకూలి వలస కూలి మృతి

NGKL: గోడకూలి వలస కూలి మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం భూనీడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శివనోళ్ల రాంరెడ్డి ఉపాధి నిమిత్తం హైదరాబాదులో కూలి పని చేస్తూ జీవనం సాగించేవాడు. రోజులాగే ఆదివారం పనికి వెళ్లగా పని ప్రదేశంలో గోడ కూలి మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.