సంతమాగులూరులో రీ సర్వే పనులు ప్రారంభం
BPT: సంతమాగులూరు మండలంలోని కొప్పరం రెవెన్యూ సజ్జాపురంలో గురువారం రీ సర్వే ప్రారంభించారు. ఉదయం ఫీల్డ్‌లోకి వెళ్లి భూములను పరిశీలించారు. మండల సర్వేయర్, విలేజ్ సర్వేయర్లు, వీఆర్వోలు పారదర్శకంగా రీ సర్వే నిర్వహించిన భూములను వెబ్ ల్యాండ్‌లో నమోదు చేస్తామని తెలిపారు. రీ సర్వే నిర్వహించే భూముల యజమానులకు నోటీసులు ఇచ్చామని వారు అన్నారు.