వైభవంగా శ్రీ కోదండరామస్వామి బ్రహ్మ రథోత్సవం
సత్యసాయి: మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా శ్రీ కోదండరామస్వామి బ్రహ్మ రథోత్సవం జరిగింది. ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు, రతాంగ హోమం నిర్వహించి, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై భక్తులకు సీతారామ లక్ష్మణులు దర్శనమిచ్చారు. కోదండరామస్వామి ఆలయం నుంచి పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం వరకు రథయాత్ర సాగింది.