POCSO కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
KDP: పీటీఎం మండలం మద్దయ్యగారి పల్లెకు చెందిన పూల నరేంద్ర రెడ్డి, అదే మండలానికి చెందిన మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో చిత్తూరు POCSO కోర్టు గురువారం 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10,వేలు జరిమానా విధించింది. బాధితురాలికి రూ.1లక్ష పరిహారం చెల్లించాలని కోర్టు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. మహిళలు, బాలికల రక్షణ తమ ప్రథమ కర్తవ్యమని SP ధీరజ్ తెలిపారు.