'టీడీపీ బలోపేతానికి చక్రపాణి కృషి చిరస్మరణీయం'

కృష్ణా: టీడీపీ సీనియర్ నేత కొల్లి చక్రపాణి సేవలు పేద ప్రజలకు వరంగా నిలిచేవని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. బుధవారం మోపిదేవిలో టీడీపీ నాయకులు దివంగత చక్రపాణి 9వ వర్ధంతి సందర్భంగా కొల్లి మురళి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేశారు. నిత్యం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ టీడీపీ బలోపేతానికి చక్రపాణి చేసిన కృషి చిరస్మరణీయం అన్నారు.