'ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి'
PPM: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే నా ఎజెండా అని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు వినతల రూపంలో అందించిన సమస్యలను పరిశీలించి వాటిలో తక్షణమే పరిష్కరించాల్సినవి అక్కడికక్కడే పరిష్కార మార్గాన్ని చూపారు.