చెట్టును ఢీకొన ఆర్టిసి బస్సు.. ఆరుగురికి గాయాలు

చెట్టును ఢీకొన ఆర్టిసి బస్సు.. ఆరుగురికి గాయాలు

హనుమకొండ: హసన్‌పర్తి మండలం అన్నసాగర్ శివారులో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేములవాడ నుండి హనుమకొండకు బయల్దేరిన వరంగల్ -2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు(TS03T1265)అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌, కండక్టర్‌తోపాటు ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు.