కార్మిక సహాయ అధికారిపై దర్యాప్తు చేయాలి: IFTU
GDWL: గద్వాల అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ తీరుపై విచారణ జరపాలని ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. 2024 నుండి కార్మికుల మరణ పరిహారం, లేబర్ కార్డులకు సంబంధించిన ఫైళ్లను సదరు అధికారి నెలల తరబడి పెండింగ్‌లో పెడుతూ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.