బాధితులను పరామర్శించిన కలెక్టర్

బాధితులను పరామర్శించిన కలెక్టర్

MBNR: ప్రభుత్వ హాస్పిటల్‌లో చిరుత దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న కోత్లబాద్‌కు చెందిన గొర్రెల కాపరులను కలెక్టర్ విజయేందిర బోయి ఆదివారం పరామర్శించారు. దాడి జరిగిన విషయాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కోయిలకొండ ఎస్సై తిరుపాజీ, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.