VIDEO: మహిళను దారుణంగా కొట్టిన జనసేన నేత

VIDEO: మహిళను దారుణంగా కొట్టిన జనసేన నేత

NLR: జిల్లాలో దారుణం జరిగింది. పెద్ద హబీపురం గ్రామంలో అనసూయమ్మ అనే మహిళ పొలంలో జనసేన నేత ఊస వెంకటరావు జేసీబీతో అక్రమంగా రోడ్డు వేస్తున్నారు. జేసీబీని అడ్డుకున్న అనసూయమ్మ, ఆమె కొడుకు సాయినాథ్‌పై 8 మంది కలిసి దాడికి పాల్పడ్డారు. తన జాకెట్ చింపేసి, చీర లాగేసి దాడి చేశారని అనసూయమ్మ పేర్కొన్నారు. ఇది తమ ప్రభుత్వమని, ఎవరు ఏం చేయలేరని వెంకటరావు వార్నింగ్ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.