'నా తండ్రి సజీవంగా ఉన్నట్లు ఆధారాలు చూపండి'
తన తండ్రి సజీవంగా ఉన్నట్లు ఆధారాలు చూపాలని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ కుమారుడు ఖాసీం ఖాన్ డిమాండ్ చేశారు. మరోవైపు తన సోదరుడు ఇమ్రాన్‌నుతో మాట్లాడేందుకు అధికారులు అనుమతించడంలేదని నూరీన్ నియాజీ వాపోయారు. కాగా, ఇమ్రాన్ ఖాన్ కస్టడీలో చనిపోయారంటూ వార్తలు రావడంతో అడియాలా జైలు వద్ద ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే.