దర్శి నియోజకవర్గ మండలాలపై చర్చ
ప్రకాశం: మార్కాపురం నూతన జిల్లా అధికారిక ప్రకటన వెలువడగానే దర్శి నియోజకవర్గ మండలాలు చర్చినీయాంశమయ్యాయి. అయితే దర్శిని అద్దంకి డివిజన్‌లో కలపకుండా డివిజన్ చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలానే దొనకొండ, కురిచేడు మండలాలను నూతన జిల్లాలో కలుపుతారని ప్రజలు పెట్టుకున్న ఆశల నీరుగారిపోయాయి. నియోజకవర్గంలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.