‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’

‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు విజయవంతం చేయాలని జిల్లా ప్రధానన్యాయమూర్తి పాటిల్ వసంత్ కోరారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్ కాంపౌండబుల్ క్రిమినల్ కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి మంచి అవకాశమని తెలిపారు. ఉభయ పక్షాల అంగీకారంతో కేసులను పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ధనం పొదుపు చేయవచ్చన్నారు.