PGRS ఫిర్యాదులను పరిష్కరిస్తాం: ఎస్పీ
KRNL: కర్నూలులోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. PGRS కార్యక్రమానికి 65 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రతి ఫిర్యాదును సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.