సెర్ప్ ద్వారా పేదరిక నిర్మూలన: కడప కలెక్టర్

కడప: జిల్లాలో 25 సంవత్సరాలుగా గ్రామీణాభివృద్ధి సంస్థ (సెర్ప్) పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. మంగళవారం రాత్రి DRDA సమీక్షలో 26, 965 స్వయం సహాయక సంఘాల ద్వారా 2. 62 లక్షల మంది మహిళలు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారన్నారు. వివిధ రంగాల్లో జీవనోపాధి పొందుతూ సాధికారత దిశగా అడుగులేస్తున్నారని అన్నారు.