షాద్‌నగర్‌ పరిధిలో మహిళ దారుణ హత్య

షాద్‌నగర్‌ పరిధిలో మహిళ దారుణ హత్య

RR: నగరంలో దారుణ ఘటన వెలుగుచూసింది. రంగారెడ్డిగూడకు చెందిన శోభ(37) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో తలపై బాది అతి కిరాతకంగా హత్య చేశారు. స్వరూప్‌నగర్ మండల పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సీఐ సీతారాం కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. పాత కక్షలా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.