గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు జగన్ అభినందనలు
AP: గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు మాజీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు. 'చట్టం, న్యాయ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఆయనకు కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించడం రాష్ట్రానికి గర్వకారణం. ఇది వారి అంకితభావానికి లభించిన గుర్తింపు. ఈ సందర్భంగా గవర్నర్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను' అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.