జో రూట్ రికార్డు.. 12 ఏళ్ల నిరీక్షణకు తెర

జో రూట్ రికార్డు.. 12 ఏళ్ల నిరీక్షణకు తెర

జోరూట్ యాషెస్ రెండో టెస్టులో సెంచరీ సాధించాడు. ఇది టెస్టుల్లో అతనికి 40వ సెంచరీ అయినప్పటికీ, ఆసీస్ గడ్డపై మాత్రం మొదటిది. గత 12 ఏళ్లుగా ఆసీస్‌లో సెంచరీ కోసం ప్రయత్నిస్తున్న రూట్, ఈ మ్యాచ్‌లో తన కల సాకారం చేసుకున్నాడు. మొత్తంగా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు. సచిన్(51), కల్లిస్(45), పాంటింగ్(41) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.