అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

అన్నమయ్య: తిరుపతి నగరంలోని సిమ్స్ అన్న క్యాంటీన్ సమీపంలో బుధవారం ఓ వ్యక్తి మృతదేహంగా కనిపించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుని జేబులో లభించిన వికలాంగుల ఆర్టీసీ బస్సు పాస్ ఆధారంగా అతను అన్నమయ్య జిల్లా గాలివీడు మండలానికి చెందిన పెంచలయ్యగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది