VIDEO: సీఎం నిర్ణయంపై రాజాసింగ్ స్పందన
HYD: హైదరాబాద్‌లో ఓ రహదారికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెడతానన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల పేరు పెట్టకుండా డొనాల్డ్ ట్రంప్ పేరెందుకు..? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వార్తల్లోకి ఎక్కడానికే ట్రంప్ పేరు పెడుతున్నారని విమర్శించారు.