లైకుల కోసం లైఫ్ రిస్క్ చేయొద్దు: సీపీ సజ్జనార్
TG: హైదరాబాద్ సీపీ సజ్జనార్ యువతకు కీలక పిలుపునిచ్చారు. లైకుల కోసం లైఫ్ రిస్క్ చేయొద్దని యువతకు సూచించారు. కదులుతున్న రైలు నుంచి వేలాడుతూ రీల్ చేస్తుండగా స్తంభం ఢీ కొని యువకుడు చనిపోయిన ఘటనపై స్పందిస్తూ ఈ విజ్ఞప్తి చేశారు. యువకుడు మృతి చెందిన వీడియోను పోస్టు చేసి సజ్జనార్ హెచ్చరించారు.