VIDEO: అనపర్తిలో కలెక్టర్ పర్యటన

E.G: అనపర్తి మండలం కొత్తూరు కాలనీలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మంగళవారం పర్యటించారు. ఫిబ్రవరి 1న సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన చేయనున్న నేపథ్యంలో అనపర్తి కొత్తూరు కాలనీని మండల, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా పలు అంశాలపై అధికారులతో చర్చించి, సీఎం పర్యటనకు అనుకూల పరిస్థితులు, సాధ్యసాధ్యాలను చూశారు.