'చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం'
MBNR: రైతు పండించిన ధాన్యం చివరిగింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. పర్తిపుర్, పెద్దవడ్డేమాన్లలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు మధ్యవర్తుల జోలికి వెళ్లకుండా నేరుగా కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలన్నారు. ధరలో పారదర్శకత ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు క్షేమం కోరుకుంటున్నారు.