కలెక్టరేట్‌లో ప్రజావాణికి 80 అర్జీలు
KMR: కలెక్టరేట్‌లో ఇవాళ నిర్వహించిన 'ప్రజావాణి'కి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ద్వారా 80 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్, అర్జీదారుల సమస్యలను ఓపికగా విన్నారు. అనంతరం ఆయన సంబంధిత జిల్లా అధికారులకు దరఖాస్తులను అందజేశారు. ఈ మేరకు వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.